Koduri kousalya devi biography

  • koduri kousalya devi biography
  • కోడూరి కౌసల్యాదేవి

    కోడూరి కౌసల్యాదేవి (ఆరికెపూడి కౌసల్యాదేవి) సుప్రసిద్ధ కథా, నవలా రచయిత్రి.

    జననం

    [మార్చు]

    ఈవిడ జనవరి 27, 1936లో జన్మించారు. ఈమె 1958లో 'దేవాలయం' అనే కథ ద్వారా రచనావ్యాసంగాన్ని మొదలుపెట్టింది. ఈమె మొదటినవల "చక్రభ్రమణం"ను 1961లో తన 25వ యేట వ్రాసింది. ఈ నవల ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక నవలల పోటీలో మొదటి బహుమతిని గెల్చుకుంది. ఈ నవలను డాక్టర్ చక్రవర్తి పేరుతో సినిమాగా తీసారు. ప్రేమనగర్, చక్రవాకం, శంఖుతీర్థం నవలలు కూడా అవే పేర్లతో సినిమాలుగా వచ్చాయి. వివాహం అయ్యాక ఇంటిపేరు ఆరికెపూడిగా మారినతర్వాత తనపేరును ఆరికెపూడి(కోడూరి)కౌసల్యాదేవిగా ప్రకటించుకుంది.

    రచనలు

    [మార్చు]

    నవలలు

    [మార్చు]

    1. అనామిక
    2. అనిర్వచనీయం
    3. కల్పతరువు
    4. కల్పవృక్షం
    5. కళ్యాణమందిర్
    6. చక్రభ్రమణం[1]
    7. చక్రనేమి
    8. చక్రవాకం
    9. జనరంజని
    10. తపోభూమి
    11. ధర్మచక్రం
    12. దిక్చక్రం
    13. దివ్యదీపావళి
    14. నెమలికనులు
    15. నందనవనం
    16. నివేదిత
    17. పసుపుతాడు
    18. పెళ్ళి ఎవరికి?
    19. పూజారిణి
    20. ప్రేమనగర్
    21. బదనిక
    22. బృందావనం
    23. భాగ్యచక్రం
    24. మార్గదర్శి
    25. మోహన మురళి
    26. శంఖుతీర్థం
    27. శాంతినికేతన్
    28. శిలలు - శిల్పాలు
    29. సంసారచక్రం
    30. సత్యం శివం సుందరం
    31. సుదక్షిణ
    32. సూర్యముఖ